prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 9:16 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఎదులాబాద్‌లో ఘనంగా గణనాథుడి నిమజ్జనం

ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ఘట్కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ భక్తి ఉత్సాహంతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. కిరణ్ కుమార్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ ఎన్. శోభ (పిడియాట్రిక్స్), స్వర్ణ, ఎం. సురేష్, ఎం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.