prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:29 pm Digital Edition : PRAJA VANI

ఎడతెరప గా కురుస్తున్న వానల వల్ల కూలిన బ్రిడ్జ్.. రాకపోకలు బంద్

*ఎడతెరప గా కురుస్తున్న వానల వల్ల కూలిన బ్రిడ్జ్.. రాకపోకలు బంద్*

ములకలపల్లి, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 23:
అశ్వారావుపేట నియోజకవర్గం లోని ములకలపల్లి మండలం రాజుపేట వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో పాల్వంచ నుండి దమ్మపేట వైపు వెళ్తున్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు అటుగా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.మండలాధికారులు వెంటనే స్పందించి రాకపోకల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.