prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:35 am Digital Edition : PRAJA VANI

ఎంబీబీఎస్ సీటు సాధించిన గూడెం గ్రామం విద్యార్థి సలీమా

ఎంబీబీఎస్ సీటు సాధించిన గూడెం గ్రామం విద్యార్థి సలీమా

గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి గ్రామ ప్రజలు శాలువతో సన్మానం

చిన్నంబావి మీడియా టుడే సెప్టెంబర్ 17

చిన్నంబావి మండలం గూడెం
గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ సీటు సాధించిన
విద్యార్థినినీ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు సాల్వతో సన్మానించి కు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతమైన
గూడెం గ్రామానికి చెందిన పింజరి సలీమ నీట్ 2026 లో 421 మార్కులు సాధించి నోవ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ హైదరాబాద్ నందు ఎంబీబీఎస్ సీటు సాధించడము జరిగింది కావున గూడెం గ్రామ సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి శాలువతో సన్మానం చేయడం జరిగింది. గూడెం గ్రామానికి చెందిన పేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ పట్టుదలతో, స్వయం కృషితో ఎంబీబీఎస్ సీటు సాధించడము ఎంతో గర్వకారణం, అదే విధంగా మిగతా గ్రామంలోని విద్యార్థులకు ఆదర్శ ప్రాయం. గ్రామంలో సలీమ ను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి బి ఆర్ ఎస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి సత్కరించారు.