ఎండపల్లి బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జగన్ కుటుంబానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భరోసా: రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 14(ప్రజావాణి): ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిఆర్‌ఎస్ పార్టీ ఎండపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం రోజున పరామర్శించారు. గుల్లకోట గ్రామంలోని జగన్ నివాసానికి చేరుకున్న మంత్రి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీలకతీతంగా మానవతా దృక్పథంతో రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ... జగన్ భౌతికంగా...