ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

కలసపాడు, సెప్టెంబర్ 6 ప్రజావాణి ముద్దంవారిపల్లి:ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కొనియాడారు.బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం ముద్దంవారిపల్లి గ్రామంలోని మండల పరిషత్ (ఎంపీ) ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న పాలకొలను శిలారెడ్డి, శ్రీమతి తాతిరెడ్డి మంజులాదేవి దంపతుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ...