ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్లగొండలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త మరియు విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ మాట్లాడుతూ, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన విద్యా సేవలు, తాత్విక ఆలోచనలు...