prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 5:43 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్లగొండలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త మరియు విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ మాట్లాడుతూ, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన విద్యా సేవలు, తాత్విక ఆలోచనలు చిరస్మరణీయమని అన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యతను పెంపొందించే మార్గదర్శి అని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు రాధాకృష్ణన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మరియు విద్యా తత్వం నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మానవీయ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు మరింత నిబద్ధతతో తన బాధ్యతలను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు నర్సింగ్ కోటయ్య, వెంకటరెడ్డి, డా. అదే మల్లేశం, శివరాణి, బొజ్జ అనిల్ కుమార్ తో పాటు అధ్యాపకులు హబీబ్, జాజుల దినేష్, నాగరాజు కదిరే, హశ్రత్ బేగం, వంశీ, పావని మరియు యన్ యస్ యస్ స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు,
తదితరులు పాల్గొన్నారు.