prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:09 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఉపాధ్యాయిని బండి పరిమళ జ్యోతి ని ఘనంగా సన్మానించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్

కడపజిల్లా శ్రీ అవధూత కాశినాయన సెప్టెంబర్ 3 (ప్రజావాణి) మండలంలోని రెడ్డికొట్టాల జెడ్పీ హైస్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బండి పరిమళ జ్యోతిని 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముందస్తుగా బేస్తవారం రోజు రాష్ట్ర ఉత్తమ గురు బ్రహ్మ పురస్కారంతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత పరిమళ జ్యోతి హరిత ఫౌండేషన్ కోఆర్డినేటర్ 17 సంవత్సరాలుగా తను విద్యార్థుల కోసం చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులను, టి ఎల్ ఎం,ఎలక్ట్రానిక్ వీడియో డివైస్, ట్యాబ్స్, డిజిటల్ విద్యా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు పరిమళ జ్యోతిని మండల విద్యాశాఖ అధికారిని ఓ నిర్మల, రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత దాదా పీర్, పి ఎస్ హెచ్ఎం ఖదీర్ భాష, ఉపాధ్యాయుల సమక్షంలో రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. కాశి నాయన మండలం ఎం ఈ ఓ నిర్మల మాట్లాడుతూ కాశినాయన మండలంలో పరిమళ లాంటి ఉపాధ్యాయిని ఉండడం మండలానికి మాకు చాలా గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు ఇంత గొప్ప టీచర్ ను చూడడమ్ తో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ బావి పౌరులుగా సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దే శిల్పి ఒక్క టీచర్ కు మాత్రమే ఉంది అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముందస్తుగా పరిమళ జ్యోతిని రాష్ట్ర ఉత్తమ గురు బ్రహ్మ పురస్కార్ తో ఘనంగా సత్కరించే భాగ్యం కల్పించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని వహీదా ఉపాధ్యాయుల గొప్పతనం గూర్చి పాట పాడి వినిపించింది రషీదా భరతనాట్యంతో అందరిని అలరించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మహేష్ కుమార్, సురేష్ , వెంకటసుబ్బయ్య, సావిత్రి ,విజయలక్ష్మి, శ్రీలత, భాష, దేవరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.