prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:00 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఉపాధికి రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి – వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

మోదీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడనాడి పేదలకు పని కలిపించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. శనివారం రోజున వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 200 రోజుల పనిరోజుకు రూ.700 వేలు పట్టణ పేదలకు ఉపాధి హామీ దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు విలయతాండవం చేస్తుంటే, వ్యవసాయ పనులు కరువు, గ్రామీణ కూలీలు ఉపాధి లేక పస్తులతో అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే ఉపాధి కల్పన పరిష్కారమని, కేంద్ర ప్రభుత్వం హామీకి అదనంగా రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించి, దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు, నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరువుతో గ్రామీణ భారత్ అల్లాడుతుంటే మోదీ ప్రచారానికి మాత్రం కొదవ లేదు.ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామీణ పేదలకు తక్షణ ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం గ్రామీణ పేదల ఆకలి కేకలను పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటంలో మునిగిపోయిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రచార పిలాన్ ఊదుతోంది – పేదల ఇళ్లలో పొయ్యి వెలగడం లేదు!దేశం అభివృద్ధి చెందుతోందని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని కేంద్రం చెబుతున్నా గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
కూలీ కుటుంబంలో పొయ్యి వెలగకపోతే వికసిత్ భారత్ ఎవరి కోసం?ఉపాధి హామీని బలహీనపరిచి పేదలపై మరో దెబ్బగ్రామీణ పేదలకు చట్టబద్ధమైన ఉపాధి హక్కు కల్పించిన ఎమ్‌జి ఎన్‌ఆర్‌ఈ జి ఈ–2005ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీని మరింత పెంచాల్సిన సమయంలో కొత్త పరిమితులు, నిబంధనలతో పేదల హక్కులను కుదించకూడదని డిమాండ్ చేశారు. చట్టం పేరు మార్చినంత మాత్రాన పేదల ఆకలి మారదు. పేదలకు కావాల్సింది ప్రచారం కాదు.కరువు సమయంలో ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ ఎందుకు ఇవ్వరు? ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, కరువు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయ పనులు తీవ్రంగా తగ్గిపోయిన గ్రామీణ కూలీలకు వెంటనే అదనపు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కరువు పంటను నాశనం చేస్తే ఉపాధి హామీ పని ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి.అందుకే కేంద్రం రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ఉపాధి ప్యాకేజీని ప్రకటించాలి పని అడిగిన ప్రతి కుటుంబానికి పని కల్పించాలి. పని కల్పించలేని పరిస్థితిలో చట్టబద్ధమైన నిరుద్యోగ భృతి అందించాలని .పట్టణ పేదలకు ఉపాధి హామీ కావాలి.గ్రామాల్లో ఉపాధి లేక పట్టణాలకు వలస వస్తున్న కూలీలకు అక్కడ కూడా స్థిరమైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అందువల్ల పట్టణ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ఉపాధి హామీ ఏర్పాటు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2 న దేశం కదలాలి.శకరువు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, తక్కువ వేతనాలు, ఉపాధి హామీని బలహీనపరిచే కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2 న దేశవ్యాప్తంగా ఆందోళనలు. కరువుతో పస్తులు – కేంద్రం వెంటనే స్పందించాలి. ఉపాధికి రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. 200 రోజుల పని – రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలి. పట్టణ పేదలకు ఉపాధి హామీ కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాల ఉపాధి సమయం లో ప్రత్యేక ఉపాధి నిధులు విడుదల చేయాలి హామీని బలహీనపరిచే చర్యలను ఆపాలని అక్టోబర్ 2 న దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలను జయప్రదం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బోజ్జ చిన్న వెంకులు గండమల్ల రాములు రెమిడాల పరశురాములు పెంటమల్ల సుకన్య ,చెరుకు పెద్దలు చింతపల్లి లూర్దు మారయ్య జటావత్తు రవి నాయక్ రెమిడీల బిక్షం మర్రి వెంకటయ్య నీలకంఠం రాములు ఉన్నారు.