ఉద్యోగాల పేరుతో ‘ముఠా’ల దందా
మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగుల ఆశలతో ఆటలు! మంచిర్యాల, సెప్టెంబర్ 29, మన సమగ్ర ప్రజావాణి: మంచిర్యాల జిల్లాలో ఉద్యోగాల పేరిట కొత్త తరహా మోసాలు కలకలం రేపుతున్నాయి. కష్టపడి చదువుకుని ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని, కొన్ని అక్రమ ముఠాలు నాగ సర్పాల్లా కాటువేయడానికి పడగ విప్పుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రముఖ సంస్థల్లోనూ పనిచేస్తున్నామంటూ లేదా తమకు ఉన్నతాధికారులతో ప్రాపకం ఉందని నమ్మబలుకుతూ అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. *ఎక్కడెక్కడ మోసాల వల?* మోసగాళ్ల కన్ను ప్రధానంగా...