*ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం*
*షాబాద్ మండలానికి చెందిన ఐదుగురికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 11 మందికి మండల స్థాయి సత్కారం*
*విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధుసూదన్ రెడ్డి*
రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 19
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. షాబాద్ మండలంలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన ఐదుగురు ఉపాధ్యాయులను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా, మరో 11 మంది ఉపాధ్యాయులను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సత్కరించారు.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎనుగంటి మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎనుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించడం ద్వారా మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ ,ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ ,సర్పంచ్ అశోక్, గోవర్ధన్ ,రెడ్డి జనార్దన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రవీందర్, సోలిపేట సర్పంచి రాజేందర్ ,రెడ్డి ఆంజనేయులు, డేవిడ్ రెడ్డి, బాలరాజ్, కృష్ణ ,మహిళా ఉపాధ్యాయులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నత అధికారులు పాల్గొన్నారు