ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

*ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం* *విద్యతోనే మనిషికి సంస్కారం.. ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి: మున్సిపల్ చైర్మన్* మేడ్చల్ (నేడు న్యూస్):- ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని రైతు వేదికలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో...