ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్వామికి గుర్తింపు..ఘనంగా సన్మానించిన లింగగిరి గ్రామ సర్పంచ్ 

ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్వామికి గుర్తింపు..ఘనంగా సన్మానించిన లింగగిరి గ్రామ సర్పంచ్  చెన్నారావుపేట సెప్టెంబర్ 09 ప్రజావాణి మండల కేంద్రంలోని లింగగిరి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కట్ట స్వామికి ఉత్తమ అవార్డు లభించడంతో బుధవారం లింగగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ మెడబోయిన రజిత కుమార్, స్వామిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల ప్రగతికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేసినందుకు అవార్డు దక్కడం గ్రామానికి, పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.ఈ...