prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:04 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్

గుల్లకోట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దోమలు, మురికి నీటి వల్ల విషజ్వరాలు వ్యాపించే ప్రమాదముందని, ప్రజలు జాగ్రత్తలు వహించాలన్నారు. శిబిరంలో గ్రామస్థులకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ కేంద్రంలో నాణ్యమైన వైద్యం అందుతుందని సూచించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలుంటే అంబారిపేట పీహెచ్‌సీకి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రక్షిత, ఏఎన్ఎమ్ సునీత, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.