ఈశ్వరమాధారంలో రీసర్వే పరిశీలించిన కలెక్టర్ దివాకర

ఈశ్వరమాధారంలో రీసర్వే పరిశీలించిన కలెక్టర్ దివాకర ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 25 కూసుమంచి మండలంలోని ఈశ్వరమాధారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ డి. సైదులుతో కలిసి రీసర్వే జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న కలెక్టర్, సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూముల రీసర్వే సమయంలో రైతుల వివరాలు, భూముల సరిహద్దులు, పక్క రైతుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు....