prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:43 am Digital Edition : PRAJA VANI

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

– ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజా వాణి
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా చర్యలను, లాక్ బుక్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ల వద్ద లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలను చేపట్టాలని, ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మాలోల, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజ్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి శ్రీనివాసరావు, ఆమ్ ఆద్మీ ప్రతినిధి మసూద్ వలి, కాంగ్రెస్ ప్రతినిధి ఇమామ్, సిపిఐ(ఎం) ప్రతినిధి రామాంజనేయులు, బిజెపి శ్యామ్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.