ఈనెల 30 వరకు రైతులందరూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి – పి. మల్లేష్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మంగళవారం చండూర్ మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ ఫార్మర్స్ రిజిస్ట్రీ జరుగుతున్న చామలపల్లి గ్రామాన్ని సందర్శించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ అనేది ఎరువులు కొనడానికి, పండించిన ధాన్యము, పత్తి ఇతర పంటల ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఫార్మర్స్ రిజిస్ట్రీ ఐడి ద్వారా మాత్రమే రానున్న కాలంలో జరుగుతుంది. ప్రస్తుతం యూరియా డిఏపి మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకుని తీసుకునే అవకాశం...