prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 2:50 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఈనెల 30 వరకు రైతులందరూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి – పి. మల్లేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

మంగళవారం చండూర్ మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ ఫార్మర్స్ రిజిస్ట్రీ జరుగుతున్న చామలపల్లి గ్రామాన్ని సందర్శించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ అనేది ఎరువులు కొనడానికి, పండించిన ధాన్యము, పత్తి ఇతర పంటల ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఫార్మర్స్ రిజిస్ట్రీ ఐడి ద్వారా మాత్రమే రానున్న కాలంలో జరుగుతుంది. ప్రస్తుతం యూరియా డిఏపి మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకుని తీసుకునే అవకాశం ఉంది. దీనిలో బుకింగ్ చేసుకోవాలంటే రైతు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకొని ఉండాలి. కాబట్టి రైతు సోదరులు ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారిని మరియు దగ్గర్లోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకోగలరు. ఈనెల 30 వరకు మాత్రమే అవకాశం ఉంది కావున రైతు సోదరులందరూ గమనించి త్వరగా ఇది చేసుకోవాలని విజ్ఞప్తి. అదేవిధంగా ప్రస్తుతం సర్వే నెంబరు వారీగా డిజిటల్ క్రాఫ్ట్ సర్వే జరుగుతున్నది. నీ యొక్క పొలంలో ఏం పంట వేశారు అనేది ఏఈవోలు గ్రామ వాలంటీర్లు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. రైతులు గమనించి వరి వేసినటువంటి రైతులు ముఖ్యంగా సన్నధాన్యం వేశారా దొడ్డు ధాన్యం వేశారా అనేదివాలంటీర్ కి చెప్పగలరు. అదేవిధంగా మీ యొక్క పంటల నమోదు అయినదా లేదా అనే విషయం కూడా మీ సంబంధి వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి చూసుకోగలరు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, పంచాయతీ సెక్రెటరీ లింగస్వామి, ఏఈఓ జగన్ మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.