prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:38 am Digital Edition : NARESH SANGAREDDY Sangareddy constituency

ఇస్నాపూర్ ముత్తంగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం r

పత్రికా ప్రకటన…. పటాన్చెరు న్యూస్,,

 

రోడ్డు ప్రమాదంలో మరణించిన నడిమింటి నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

 

జాతీయ రహదారి ఎన్ ఎచ్ 65 కాంట్రాక్టర్ల పూర్తినిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణo

 

ఎన్ ఎచ్ 65 కాంట్రాక్టర్ యాజమాన్యం ,బాధిత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఎం ఆర్ పి ఎస్ డిమాండ్,,

 *మైసగళ్ళ బుచేంద్ర మాదిగ*

ఎం ఆర్ పి ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు

 

ఈరోజు ఉదయం ఎన్ హెచ్ 65 ముంబై జాతీయ రహదారిపై సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామానికి చెందిన నడిమింటి నర్సింలు మాదిగ లారీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది, ఇట్టి ప్రమాదంలో పూర్తి నిర్లక్ష్యం జాతీయ రహదారిని విస్తరిస్తున్న కాంట్రాక్టర్ల దే బాధ్యతగ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని

*మైసగళ్ల బుచేంద్ర* మాదిగ

ఎం ఆర్ పి ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు, వారు మాట్లాడుతూ అంతేకాకుండా ప్రభుత్వం కూడా విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా ఒత్తిడి

తెకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా గత రెండు సంవత్సరాలుగా అసంపూర్తిగా సూచిక బోర్డులు లేకుండా అస్తవ్యస్తంగా పనులు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పేద మధ్యతరగతి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇట్టి విషయమై ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరగకుండా విస్తరణ పనులు త్వరగా పూర్తిచేసే విధంగా పూర్తి ఒత్తిడి చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని డిమాండ్ చేశారు, బాధిత నడిమింటి నర్సింలు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దేని ప్రభుత్వం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,

విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ బృందం కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని తెలియజేశారు,

 

ఈ కార్యక్రమంలో

గంధ గల్లా వీరయ్య మాదిగ ఎమ్మెస్సీ జిల్లా నాయకులు,

కొలుకుందు మోహన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, ముబారక్ పూర్ గ్రామ సర్పంచ్ , నరేష్, కేసారం కృష్ణ, రాములు, వెంకట్ గ్రామస్తులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నమస్కారాలతో….

 

మీ..*మైసగళ్ళ బుచ్చేంద్ర* మాదిగ ఎం ఆర్ పి ఎస్