ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారుల తనిఖీలు
*ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారుల తనిఖీలు* నేరేడుచర్ల, ప్రజావాణి, జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 26. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండలంలోని పలు ఇసుక క్వారీలను జిల్లా మైనింగ్ ఆర్‌ఐ నాగమణి, ఎస్‌ఆర్‌ఓ బాబు తదితర అధికారులు తనిఖీ చేశారు.తనిఖీల్లో భాగంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆ ట్రాక్టర్‌ను నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నిఘా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.