prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:22 pm Digital Edition : PRAJA VANI

ఇసుక కుప్పల బహిరంగ వేలానికి ప్రకటన

ఇసుక కుప్పల బహిరంగ వేలానికి ప్రకటన

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గ్రామ పరిధిలో నిల్వ ఉన్న ఇసుక కుప్పలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రకటన జారీ చేశారు.మొత్తం 4 ఇసుక కుప్పలను వేలానికి ఉంచగా,ఒక్కో కుప్పకు రూ.1,150 చొప్పున కనీస విలువను నిర్ణయించారు. నాలుగు కుప్పలకు కలిపి రూ.4,600 కనీస విలువగా అధికారులు నిర్ణయించారు.
సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 11.30 గంటలకు బెజ్జంకి గ్రామంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కార్యాలయం వెల్లడించింది. వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు సంబంధిత నిబంధనలు, నిర్ణీత విధానాలను పాటిస్తూ వేలంలో పాల్గొనాలని అధికారులు సూచించారు.