*ఇబ్రహీంపట్నంలో భూకబ్జాల లెక్కలు బయటపెడతాం*
*బీఆర్‌ఎస్ నేతలు ఆక్రమించిన భూములను పేదలకు పంచుతాం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి*
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం: సెప్టెంబర్19 (ప్రజావాణి )
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూకబ్జాల వివరాలను ఏ విధంగా వెలుగులోకి తీసుకువచ్చారో, అదే విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూకబ్జాల వివరాలను కూడా బయటపెడతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో భూకబ్జాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానమిస్తూ.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్న భూములను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు, వారి అనుచరులు గత పదేళ్లలో ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా భూముల వివరాలను కూడా వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు.
పేద ప్రజలకు న్యాయం జరిగేలా, ఆక్రమణలకు గురైన భూములపై పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు గత పదేళ్లలో కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి గుంట భూమి వివరాలను బయటకు తీస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బట్టకాల్చి మీద వేసినట్లుగా తనపై ఆరోపణలు. ప్రజల కోసం ఓపికగా పనిచేస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి తాము తీసుకువచ్చిన నిధులు, గతంలో జరిగిన అభివృద్ధిపై అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు.