ఇప్పాయిపల్లిలో ఘనంగా గణనాథునికి ప్రత్యేక పూజలు
హాజరైన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ బొలసని భీమిరెడ్డి
పరిగి సెప్టెంబర్ 26(ప్రజావాణి)
కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. చాకలి సావిత్రి–బాలయ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) నరేందర్ నాయక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ బొలసని భీమిరెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు పరిగి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రంపోటి మల్లేష్, రాంపూర్ సర్పంచ్ చెక్కల తిరుపతయ్య, మాజీ సర్పంచ్ కావలి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు, కుల్కచర్ల మండల గౌడ సంఘం ఉపాధ్యక్షుడు షాబాద్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మాలే కృష్ణయ్య గౌడ్, మండల రైతు సంఘం మాజీ అధ్యక్షుడు కొత్తబలిజ రాజు, మార్కెట్ కమిటీ సభ్యుడు భరత్ రెడ్డి, నాయకులు తమ్మలి రామచంద్రయ్య, జి. ఆనంద్, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గాదే రామయ్య, రఘు గౌడ్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు పసుల మల్లయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే వెంకటయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, నీల రాఘవేందర్, శంకర్, మధు, శివాజీ యువజన సంఘ సభ్యులు, గ్రామ మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.