తీవ్రమైన కాళ్ల నొప్పితో బాధపడుతూ ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొంగతుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మారం ఎస్ఐ ఎంబడి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… దొంగతుర్తికి చెందిన జుంజుపల్లి నారాయణ (60)కు మూడు నెలల క్రితం ప్రమాదం జరిగి కుడికాలుకు ఇన్ఫెక్షన్ అయింది. ఆ నొప్పి భరించలేక సోమవారం ఉదయం ఇంట్లో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొడుకు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.