prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 3:15 pm Digital Edition : PRAJA VANI

ఇనుగుర్తిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి..

ఇనుగుర్తిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి..
ప్రజావాణి,ఇనుగుర్తి: తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 131 వ,జయంతి మండల కేంద్రం ఇనుగుర్తిలో రజక అధ్యక్షులు కొలిపాక నారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నేతలు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆహూ తులైన వక్తలు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వాములు దొరలపై తిరుగుబాటు చేసిన గొప్ప విప్లవ యోధురాలని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ సట్ల మల్లయ్య, వివిధ పార్టీలు,ప్రజాసంఘాల నాయకులు బైరు అశోక్ గౌడ్,కూరెల్లి సతీష్,బండి సత్యం
,కావటి నరసయ్య,ఓరిగంటి కిష్టయ్య,శంకరయ్య,వడ్డేపల్లి యాకయ్య,తీగల స్వామి, చినాలకట్టయ్య,మామిడి జనార్ధన్,కొట్టం మహేందర్,దేవులపల్లి చిన్న వెంకన్న,నరెడ్ల బిక్షపతి,పింగళి శ్రీనివాస్,బోళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.