ఇటుకులపాడులో ఘనంగా వినాయక చవితి వేడుకలు.61,100లకు 13 కిలోల లడ్డూ వేలం.మద్దూరి పోలయ్య సొంతం

కాశినాయ సెప్టెంబర్ 19 (ప్రజావాణి) ఇటుకులపాడు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఐదో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలోని వినాయక మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.భక్తులకు అన్నదానం చేసిన బుర్ర ఎల్లయ్య ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా 13 కిలోల భారీ లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొనగా, చివరకు మద్దూరి పోలయ్య రూ.61,100లకు లడ్డూను...