prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:36 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇటుకులపాడులో ఘనంగా వినాయక చవితి వేడుకలు.61,100లకు 13 కిలోల లడ్డూ వేలం.మద్దూరి పోలయ్య సొంతం

కాశినాయ సెప్టెంబర్ 19 (ప్రజావాణి) ఇటుకులపాడు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఐదో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలోని వినాయక మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.భక్తులకు అన్నదానం చేసిన బుర్ర ఎల్లయ్య ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా 13 కిలోల భారీ లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొనగా, చివరకు మద్దూరి పోలయ్య రూ.61,100లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డు ను దక్కించుకున్న మద్దూరి పోలయ్యను శ్రీ వరసిద్ధి వినాయక యూత్ కమిటీ నెంబర్లు, గ్రామస్థులు అభినందించారు.అదేవిధంగా భక్తుల కోసం బుర్ర ఎల్లయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, చిన్నారులు, యువతతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ మెంబర్లు ఏర్పాట్లు చేశారు.వినాయక మండపం వద్ద భక్తుల రాకతో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి నిమర్జనం చేశారు.శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ నెంబర్లు మరియు గ్రామస్థుల సహకారంతో వినాయక చవితి ఐదో రోజు వేడుకలు,లడ్డూ వేలం, అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేశారు.