prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:33 am Digital Edition : MAHESH MEDCHAL

ఇందిరానగర్‌ కాలనీలో ఘనంగా వినాయకుడికి కుంకుమా అర్చన కుంకుమ

₹మేడ్చల్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో ఘనంగా వినాయక పూజలు*

*మహారాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో మంగళహారతి, అన్నదాన కార్యక్రమ*

మేడ్చల్‌ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌ కాలనీలో మహారాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మండపంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి శ్రీ లక్ష్మీ గణపతి మంగళహారతి అత్యంత భక్తిశ్రద్ధలతో. సోమవారం నిర్వహించారు. స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి లంబో తరుణ్ కి దూప ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. సందర్భంగా మహిళలు భక్తిగీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.వినాయకుడి ఆశీస్సులతో కాలనీవాసులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మహిళలు, నిర్వాహకులు ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా మహారాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమానికి కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను ప్రతి ఒక్కరి సహకారంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులు, కాలనీవాసులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మహారాజ్‌ యూత్‌ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.