prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 1:33 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం

*ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం*

*కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి*

*చాకలి యాదయ్య కుటుంబాన్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే*

*ఆతిథ్యం స్వీకరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే*

చిలిపిచెడ్.సెప్టెంబర్ 17 ప్రజావాణి

చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో చాకలి యాదయ్య ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చాకలి యాదయ్య కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కలిసి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కటింగ్ చేసి కుడి కాలితో గృహ ప్రవేశం చేశారు. అనంతరం దేవుని చిత్రపటానికి బొట్టు పెట్టి పూలమాల వేశారు.

అనంతరం చాకలి యాదయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించారు. అలాగే వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, గ్రామ పెద్దలను శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా చాకలి యాదయ్య కుటుంబాన్ని శాలువాతో సత్కరించి, నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. చాకలి యాదయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి, వచ్చిన అధికారులకు అతిథి మర్యాదలు చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, ఫైజాబాద్ గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, సెక్రెటరీ నాగరాజు, సంగ గౌడ్, ఎంసీ విఠల్, రాజు, లక్ష్మీనరసింహారెడ్డి, గోపాల్ రావు, యాదేశ్, రాజేందర్, జనార్దన్, కిరణ్, షాపి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.