*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి):
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ నిర్వహణ కమిటీకి ఎన్నికలు 04-10-2026న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. కిరణ్ ప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అదే విధంగా తుది సభ్యుల జాబితాను కూడా ప్రచురించడం జరిగిందని తెలిపారు.
*ఎన్నికల కార్యక్రమం:*
24-09-2026: ఉదయం 10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00 గం. వరకు నిర్వహణ కమిటీ సభ్యుల పదవులకు నామినేషన్ల స్వీకరణ.
*స్థలం:* రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, జనగామ.
25-09-2026 ఉదయం 10.00 గం. నుంచి నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ప్రచురణ,
26-09-2026 ఉదయం 10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00 గం. వరకు నామినేషన్ల ఉపసంహరణ, తుది నామినేషన్ల జాబితా ప్రచురణ, గుర్తుల కేటాయింపు.
04-10-2026 అవసరమైన పక్షంలో ఎన్నికలు నిర్వహించబడతాయి.
ఉదయం 8.00 గం. నుంచి మధ్యాహ్నం 3.00 గం. వరకు పోలింగ్.
*పోలింగ్ కేంద్రం:* ప్రెస్టన్ జూనియర్ కళాశాల, జనగామ.
అదే రోజు సాయంత్రం 4.00 గం. నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం ఆఫీస్ బేరర్ల ఎన్నికలు నిర్వహిస్తారు.
*నామినేషన్ ఫీజు:* రూ.10,000/- (తిరిగి చెల్లించబడని రుసుము)
నామినేషన్ ఫారాలను ఎన్నికల అధికారిని వ్యక్తిగతంగా సంప్రదించడం ద్వారా లేదా ఆయనకు రాతపూర్వకంగా అభ్యర్థన సమర్పించి అధీకృత వ్యక్తి ద్వారా 24-09-2026న ఉదయం 10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00 గం. వరకు పొందవచ్చని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం ఎన్నికల అధికారి ఫోన్ నంబర్ *7995087589* ను సంప్రదించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రంలో గుర్తింపు కోసం సొసైటీ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఫోటో గుర్తింపునకు సంబంధించిన ఆధారాన్ని సభ్యులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కోరారు.