ఇంటి స్థలం కబ్జా యత్నంపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

ఇంటి స్థలం కబ్జా యత్నంపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 18, ప్రజావాణి: తమ కుటుంబం గత 50 ఏళ్లుగా నివాసముంటున్న ఇంటి స్థలాన్ని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన బాధితుడు నిమ్మశెట్టి వెంకన్న ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ​ తాము నివసిస్తున్న స్థలాన్ని కోంతమంది దొంగతనంగా తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఇల్లు ఖాళీ చేయకపోతే జేసీబీతో కూల్చేస్తామని బెదిరిస్తున్నారని...