prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:35 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

ఇంటి తలుపులు తెరిచి దొంగతనానికి యత్నం

ఇంటి తలుపులు తెరిచి దొంగతనానికి యత్నం

చెన్నారావుపేట ఆగస్టు 31 ప్రజావాణి

తాళం వేసి ఉన్న ఇంటి వెనుక తలుపులు తెరిచి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించిన సంఘటన మండల పరిధిలోని తిమ్మరాయిని పహాడ్ గ్రామంలో వెలుగుచూసింది. బాధితురాలు రెడ్డిమాసు సౌభాగ్యం, తెలిపినా వివరాల ప్రకారం.. ఈ నెల 23న గ్రామంలోని బంధువుల పెళ్లికి వచ్చి సాయంత్రం ఇంటికి తాళం వేసి వరంగల్ వెళ్లారు. సోమవారం (ఆగస్టు 31) మధ్యాహ్నం ఇంటి వెనుక తలుపు తీసి ఉండడాన్ని గమనించిన బంధువులు బాధితురాలికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి పరిశీలించగా బీరువాలోని 2.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.6,000 వేల నగదు సురక్షితంగా ఉన్నాయని, దొంగతనానికి మాత్రమే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు. బాధితురాలు సౌభాగ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.