ఇంటి చుట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గాగిల్లాపూర్ గ్రామ సర్పంచ్ కనకచంద్రం
మద్దూరు సెప్టెంబర్ 25, ప్రజా వాణి
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిలో మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలని ఇంకుడు గుంతలు లేనివారికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు.పిచ్చి మొక్కలు గడ్డి తొలగించుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాలు కురుస్తున్న పరిస్థితుల వల్ల జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రజియా, ఏఎన్ఎం నిర్మల,గుడిసె అరుణ, దాసరి చంద్రకళ, సి ఎ ఆంజనేయులు, కారోబార్ శ్రీకాంత్,ఆశా వర్కర్ బాబాయ్ తదితరులు పాల్గొన్నారు