prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 10:30 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఆసరా పింఛన్ల గడువు సెప్టెంబర్ 15 వరకు పెంపు – ఎంపీడీవో

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మండలం ఎంపిడివో కార్యాలయం లో ఎంపిడివో బి యాదగిరి మాట్లాడుతూ సోమవారం వరకు 611 మంది పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇందులో వితంతువులు 245, ఒంటరి మహిళలు 29, దివ్యాంగులు 130, చేనేత కార్మికులు 5, గీతా కార్మికులు 202 దరఖాస్తు చేసుకున్నారు. చేయూత పెన్షన్లను అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆగస్టు 31 వరకు ఉండెను ప్రస్తుతం ఇంకను సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినది. గతంలో తెలిపినట్లుగా ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు చేనేత కార్మికులు గీతా కార్మికులు పైలేరియా పేషెంట్లు తొలి సేమియా సికిల్ సెల్ డిసీజెస్ పెన్షన్లు మంజూరు కి తగిన చర్యలు గైకొనబడునని మండలంలోని అందరికీ తెలియజేయుటకు కోరారు. దరఖాస్తుదారులు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులను అందజేసి రసీదులు పొందవలసిందిగా ఎంపీడీవో బి.యాదగిరి తెలిపినారు. మండల ప్రజలందరూ గ్రహించవలసిందిగా కోరనైనది.