ఆశాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నిరసన: సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లిన ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్ ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం చండూరు మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలపై ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనవ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల వలన కార్మిక...