ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1977–2026 స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రిసోర్స్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రతినిధుల సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సంఘం నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ స్వర్ణోత్సవాల సభలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్, రాష్ట్ర కార్యదర్శి ఎన్. నర్సింలు,...