prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 12:34 pm Digital Edition : PRAJA VANI

ఆర్దికంగా మహిళలు అభివృద్ధి చెందాలి

ఆర్దికంగా మహిళలు అభివృద్ధి చెందాలి

గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం అద్యక్షులు సత్యనారాయణ

నర్సాయపల్లిలో ఉచిత కుట్టుమిషన్ కేంద్రం ప్రారంభం

మద్దూరు సెప్టెంబర్ 8, ప్రజా వాణి,

మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మండలంలోని షాలేము ప్రార్థన మందిరం నరసాయపల్లి గ్రామ సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ,సంఘ సేవకులు అందె విజయ్ కుమార్ మరియు చేర్యాల మండల బి ఆర్ఎస్ మండల మాజీ సెక్రటరీ కోతిదాసు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్ని వర్గాల మహిళలు ఈ ఉచిత  కుట్టు మిషన్ కేంద్రాన్ని ఉపయోగించుకొని తమ కాళ్ళపై నిలబడి ఆర్దికంగా అభివృద్ధి చెందాలన్నారు.గ్రామ పంచాయతీ సెక్రటరీ కిరణ్, నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో పాస్టర్ సామ్యూల్, బ్రదర్ కుమార్, జాన్ వెస్లీ, ప్రభాకర్, మోజస్, పలువురు గ్రామస్తులు,మహిళలు పాల్గొన్నారు.