prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 12:08 pm Digital Edition : RAKESH PEDDAPALLY

ఆర్జీ-1 ఏరియాలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

 

 

గోదావరిఖని, సెప్టెంబర్ 16 ప్రజావాణి :

 

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మంగళవారం ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైనింగ్ అనేది వివిధ ఇంజినీరింగ్ విభాగాల సమష్టి కృషితో నడిచే బృహత్తర రంగమని, రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా ఇంజినీర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో విశేష ప్రతిభ కనబరిచిన ఇంజినీర్లకు ‘బెస్ట్ ఇంజినీర్’ అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. సీఎస్పీ జీడీకే డిప్యూటీ జనరల్ మేనేజర్ (E&M) పైడీశ్వర్.. 30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 55 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించడం, రూ.2.20 కోట్ల డ్యామరేజ్ పెనాల్టీలను తగ్గించడం, రూ.30 లక్షల విద్యుత్ ఆదా చేయడంతో పాటు జీరో బ్రేక్డౌన్స్ సాధించిన ప్రతిభకు గాను ఈ అవార్డు అందుకున్నారు. అలాగే జీడీకే ఓసీ-2 ఎలక్ట్రికల్ డీజీఎం ఎస్. సతీష్ చక్రవర్తి కూడా ఉత్తమ ఇంజినీర్ అవార్డును స్వీకరించారు. అనంతరం జీడీకే సీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. రమేష్ తమ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ వేడుకల్లో రామగుండం లోకల్ సెంటర్ చైర్మన్ అప్పారావు, గౌరవ కార్యదర్శి కె. శ్రీనివాస రెడ్డి, జీడీకే-11 గ్రూప్ ఏజీఎం సీహెచ్. శ్రీనివాస్, జీడీకే-1 ఏజెంట్ డి. రమేష్, ఏరియా ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావుతో పాటు పలువురు శాఖాధిపతులు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్రను, విశ్వేశ్వరయ్య సేవలను వక్తలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకున్నారు.