ఆరోగ్యమే చదువుకు తొలి మెట్టు.

ఆరోగ్యమే చదువుకు తొలి మెట్టు. విద్యార్థులకు పౌష్టిక అల్పాహారానికి శ్రీకారం పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ పోత్కపల్లిలో ఘనంగా ప్రారంభం ఓదెల, సెప్టెంబర్ 21: విద్యార్థుల ఆరోగ్యం, శారీరక–మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాఠశాల అల్పాహార కార్యక్రమాన్ని ఓదెల మండలం పోత్కపల్లిలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించే కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఏఏపీసీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి శ్రీకారం...