prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 9:22 am Digital Edition : PRAJA VANI

ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన నూతన కమిటీ ఎన్నిక

ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన
నూతన కమిటీ ఎన్నిక

సెప్టెంబర్ 30.ప్రజావాణి న్యూస్/ సంగెం

ఆయిల్పాం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నంద్యాల కృష్ణారెడ్డి చెప్పారు.మంగళవారం మండల కేంద్రంని రైతు వేధికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆయిల్పాం రైతుల సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షులు చాడ కొమురరెడ్డి, గుడిపూడి అరుణారాంచందర్రావు, జిల్లా ప్రధానకార్యదర్శి కుంచారపు వెంకట్రెడ్డి, సంగెం మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, రావుల రామకృష్ణలు పాల్గొన్నారు.మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆయిల్పం రైతుల కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడు నంద్యాల కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగింది. మండల కమిటీ అధ్యక్షుడిగా కాట్రపల్లి హవేలి గ్రామానికి చెందిన చొల్లేటి యుగేంధర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా కౌడగాని శంకర్రావు, చింతాకుల సురేందర్, అప్పని కోటేశ్వర్, జీజుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శాబోతు రమేష్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా అల్ల మధు,కోశాధికారిగా కూసరాజవీరు, కార్యవర్గ సభ్యులు గా సోలగుడి బాబురావు,దౌలత్బాజీ గోవర్దన్, శింగిరెడ్డి కుమారస్వామి, గుగులోతు బోంద్యా, బానోతు దేవసింగ్, వేల్పుల అశోక్, కడ్డూరి రాజు, గౌరవ అధ్యక్షుడిగా గూడ సుదర్శన్రెడ్డిలు ఎన్నికయ్యారు.