ఆఫీస్ టైంలో వీఆర్వో కునుకు: బయట ప్రజల పడిగాపులు. కలసపాడు మండలంలో అధికారుల నిర్వాకంపై వెల్లువెత్తుతున్న నిరసనలు!
కలసపాడు, సెప్టెంబర్ 18: ప్రజావాణి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు జవాబుదారీగా ఉంటూ,వారి సమస్యలను పరిష్కరించాల్సిన ఓ ప్రభుత్వ అధికారిణి బాధ్యతారహితంగా ప్రవర్తించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కడప జిల్లా కలసపాడు మండలంలోని తంబళ్లపల్లె గ్రామ రెవెన్యూ అధికారి పచ్చినీళ్ల విజయకుమారి ఆఫీస్ వేళల్లో కుర్చీలోనే గాఢ నిద్రలో మునిగిపోయారు.వివిధ రకాల సర్టిఫికెట్లు, భూమి సమస్యలు,ఇతర రెవెన్యూ పనుల కోసం మండలంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కార్యాలయం వెలుపల గంటల తరబడి వేచి చూస్తుండగా,సదరు అధికారిణి మాత్రం లోపల...