ఆధునిక సౌకర్యాలతో ప్రొద్దుటూరు ఎస్‌డీపీఓ కార్యాలయం పునరుద్ధరణ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా..ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 3: పోలీస్ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణంతో పాటు, వివిధ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించిన ప్రొద్దుటూరు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం ప్రారంభించారు.మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, ప్రొద్దుటూరు ఏఎస్పీ శ్రీ యు. విబు కృష్ణ, ఐపీఎస్...