నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నాగార్జున ప్రభుత్వ కళాశాల, తెలుగుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఈ నెల 26న ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యస్వర్ణోత్సవం (1976-2026) జాతీయ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దoడి శ్రీధర్ తెలిపారు. ప్రారంభ సమావేశంలో తెలంగాణ శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహా రెడ్డి, గౌరవ అతిథిగా, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. నామోజు బాలాచారి విశిష్ట అతిథిగా, డా. సంగనభట్ల నర్సయ్య ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. డా. గండ్ర లక్ష్మణ రావు కీలకోపన్యాసం చేస్తారని అన్నారు. మొదటి సాంకేతిక సదస్సుకు ఆచార్యఅప్పాజోస్యుల సత్యనారాయణ అధ్యక్షత వహిస్తారు. డా. కోయికోటేశ్వరరావు, డా. బాశెట్టి లత, బూర్ల వెంకటేశ్వర్లు, బి. మహేష్ లు పత్ర సమర్పణచేస్తారు. రెండవ సాంకేతిక సదస్సుకు డా. రావులపాటి సీతారాం అధ్యక్షత వహిస్తారు. డా. సంగిశెట్టి శ్రీనివాస్, డా. పసునూరి రవీందర్, డా. తండు కృష్ణ కౌండిన్య, డా. అరుణధూళిపాళ, డా. వీపూరి వెంకటేశ్వర్లు, డా. డి. లక్ష్మయ్య పత్రసమర్పణ చేస్తారని తెలిపారు. సమాపనోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య తంగెడ కిషన్ రావు ముఖ్య అతిథిగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కొప్పులఅంజిరెడ్డి గౌరవ అతిథిగా, ప్రముఖ కథకులు, నవలాకారులు వి. రామమోహన రావు, విశిష్ట అతిథిగా, ఆచార్య పిల్లలమఱ్ఱి రాములు ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య వైభవాన్ని, పద్య వైభవాన్ని నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సదస్సును స్థానిక పరిశోధకులు, విద్యార్థులు, సాహితీవేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.