అసెంబ్లీలో నారాయణఖేడ్ సమస్యలపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి గళం

అసెంబ్లీలో నారాయణఖేడ్ సమస్యలపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి గళం సెప్టెంబర్ 18 (ప్రజావాణి) ముందుగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ లైన్ల బైఫర్‌కేషన్‌తో పాటు ఇతర విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అవసరమైన కొన్ని సబ్‌స్టేషన్లకు కూడా మంజూరు లభించిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు విద్యుత్‌ను సరైన సమయంలో, నిరంతరాయంగా అందించేందుకు కింది...