అసెంబ్లీలో నారాయణఖేడ్ సమస్యలపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి గళం
సెప్టెంబర్ 18 (ప్రజావాణి)
ముందుగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ లైన్ల బైఫర్‌కేషన్‌తో పాటు ఇతర విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అవసరమైన కొన్ని సబ్‌స్టేషన్లకు కూడా మంజూరు లభించిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు విద్యుత్‌ను సరైన సమయంలో, నిరంతరాయంగా అందించేందుకు కింది స్థాయి అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా పెద్ద శంకరంపేట్ మండలంలో విద్యుత్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని అప్పుడే ప్రతిపక్ష నాయకులు ధర్నాలు చేస్తున్నారు. అందుకే సభ దృష్టికి తీసుకువచ్చి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.అలాగే నియోజకవర్గంలోని తాగునీటి సమస్యను కూడా అసెంబ్లీలో ప్రస్తావించి,ఖేడ్ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.