prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 3:16 pm Digital Edition : PRAJA VANI

అసెంబ్లీకి తరలివెళ్లిన బెజ్జంకి ఆశా కార్యకర్తల అరెస్ట్

అసెంబ్లీకి తరలివెళ్లిన బెజ్జంకి ఆశా కార్యకర్తల అరెస్ట్

 

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం

 

ఆశా యూనియన్ మండల అధ్యక్షురాలు బండిపల్లి భాగ్య

 

బెజ్జంకి, సెప్టెంబర్ 11 (ప్రజావాణి)

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా BRTU ఆశా యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద చేపట్టిన చలో అసెంబ్లీ ధర్నాకు బెజ్జంకి మండల ఆశా కార్యకర్తలు తరలివెళ్లారు. సుందరయ్య పార్క్ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఆశా యూనియన్ మండల అధ్యక్షురాలు బండిపెల్లి భాగ్య మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా గ్రామాల్లో గర్భిణులు, నవజాత శిశువులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన రూ.18 వేల వేతన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని భాగ్య స్పష్టం చేశారు. అవసరమైతే సమ్మె బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశాకార్యకర్తలు రజిత, సౌమ్య, రేణుక, రజిని, పుష్పలత, పుష్ప, లావణ్య, మాధవి, ప్రేమలత, కవిత, స్వప్న, మనీషా, నాగమణి తదితరులు పాల్గొన్నారు.