అల్మాయిపేట్‌లో రేపు గణేష్ నిమజ్జనం
•నిమజ్జన కార్యక్రమాన్ని
విజయవంతం చేయండి: ఉత్సవ కమిటీ ఆహ్వానం
ఆల్మయిపేట సెప్టెంబర్ 21
మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి
అందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 22న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
గ్రామంలో ఒకే గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను గ్రామంలోని చిన్నలు, పెద్దలు, యువకులు, మహిళల సహకారంతో నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమానికి జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్సై గిరి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతల మధ్య జరిగేలా పోలీసు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
గ్రామంలో ఒకే గణపతిని ప్రతిష్ఠించి, గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. అల్మాయిపేట్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల్లో కూడా ఒకే గణపతిని ప్రతిష్ఠించి సామరస్యంగా ఉత్సవాలు నిర్వహించడంపై ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆలోచించాలని అధికారులు సూచించారు.