అలక నీలమ్మ చిత్రపటానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నివాళులు
నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గం,నేరేడుచర్ల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు అలక శ్రవణ్‌రెడ్డి,అంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధినేత అలక సైదిరెడ్డి తల్లి అలక నీలమ్మ మృతికి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల పట్టణ పరిధిలోని నరసయ్యగూడెంలో నీలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నీలమ్మ భర్త అలక లింగారెడ్డి, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. నీలమ్మ ఇటీవల అస్వస్థతకు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని...