prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:04 am Digital Edition : NARESH HUZURNAGAR

అలక నీలమ్మ చిత్రపటానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నివాళులు

నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గం,నేరేడుచర్ల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు అలక శ్రవణ్‌రెడ్డి,అంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధినేత అలక సైదిరెడ్డి తల్లి అలక నీలమ్మ మృతికి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల పట్టణ పరిధిలోని నరసయ్యగూడెంలో నీలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నీలమ్మ భర్త అలక లింగారెడ్డి, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. నీలమ్మ ఇటీవల అస్వస్థతకు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు కొణతం మంజుల, తాళ్ల లావణ్య, యారవ లక్ష్మి, నన్నెపంగ శ్రీనివాస్, బొలిశెట్టి లక్ష్మయ్య, ఎండి కలీం, కో-ఆప్షన్ సభ్యులు పొనుగోటి శోభ, మౌలాబి, మత్స్య సొసైటీ చైర్మన్ పేరబోయిన వీరయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాణోతు లలిత, వేమూరి నాగవేణి, దిర్శించర్ల సర్పంచ్ బుర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నాయకులు కటికం రమేష్, యారవ శ్రీనివాస్, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, చింతమల్ల సైదులు, పురుషోత్తంరెడ్డి, రేవంత్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, బిక్షం, రామకృష్ణ, రామ్‌రెడ్డి, భరత్, నక్క రమాదేవి తదితరులు హాజరయ్యారు.