అర్హత ఉన్నా అందని ‘తల్లికి వందనం’ ఆరుగురు ఆడపిల్లలకు!

కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 26ప్రజావాణి  మండలం అక్కలరెడ్డిపల్లిలో గుండెలు పిండేసే దయనీయ స్థితి నెలకొంది. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న సుభద్ర-బాలయ్య దంపతుల ఆరుగురు ఆడబిడ్డల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్న ఈ ఆరుగురు పసిమొగ్గలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘తల్లికి వందనం’ పథకం దక్కకుండా పోయింది. నిబంధనల ప్రకారం అర్హుల జాబితాలో పేర్లు నమోదైనా.వారి బ్యాంకు ఖాతాల్లో మాత్రం ఒక్క పైసా కూడా జమ కాలేదు.రోజూ సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా..మా పరిధిలో...